తిరుమల తిరుపతి పాలక మండలి సమావేశం సోమవారం జరిగింది. ఈ పాలకమండలిలో తీసుకున్న నిర్ణయాలను చైర్మన్ కరుణాకర్ రెడ్డి తెలిపారు. అలిపిరి వద్ద ప్రతి నిత్యం శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహిస్తామని భక్తులు తమకు ముఖ్యమైన రోజులలో హోమంలో స్వయంగా పాల్గొనే అవకాశాన్ని టీటీడీ కల్పిస్తుంది. టీటీడి పారిశుధ్య కార్మికుల జీతాలను రూ.12 వేల నుంచి 17 వేలకు పెంచామని తెలిపారు. పలు నిర్ణయాలకు బోర్డు ఆమోదం తెలిపింది.