ప్రముఖ కార్ల కంపెనీ మారుతీ సుజుకీకి మంగళవారం కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ విషయాన్ని కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. రూ.16.27 లక్షల పన్ను ఎగువేతకు కంపెనీ పాల్పడినట్లు నోటీసుల్లో పేర్కొంది. కస్టమ్స్ జారీ చేసిన నోటీసులకు చట్టబద్ధంగా సమాధానం ఇస్తామని మారుతీ సుజుకీ పేర్కొంది. షోకాజ్ నోటీసుల కారణంగా కంపెనీ ఆర్థిక, నిర్వహణ కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావం చూపలేదన్నారు.