పుంగనూరు నియోజకవర్గం పులిచెర్ల మండలం కల్లూరులో విద్యార్థుల కండ్ల కలక వ్యాధి కలవరపెడుతోంది. 150 మంది విద్యార్థులు ఉన్న బీసీ హాస్టల్లో మంగళవారంకు సుమారు 50 మంది విద్యార్థులు కండ్ల కలకతో మంగళవారం హాస్టల్ నుంచి ఇంటికి వెళ్లినట్లు వార్డెన్ నవీన్ తెలిపారు. కళ్ళలో దురద, మంట, కంటి రెప్పలు అతుక్కోవడం లాటి పరిణామాలు విద్యార్థులు ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు.