ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య జరుగుతున్న యుద్ధం తీవ్రరూపం దాల్చుతోంది. ఈ నేపథ్యంలో హమాస్ ఉగ్రవాదులపై ఇజ్రాయెల్ దాడులను మరింత ఉధృతం చేసింది. గాజా వెంబడి సరిహద్దులను దాదాపు తమ అధీనంలోకి తీసుకుంది. అయితే సరిహద్దుల్లోని దళాలకు కీలక ఆదేశాలందాయి. గాజా వైపు నుంచి ఎవరైనా సరిహద్దులను దాటే ప్రయత్నం చేస్తే వారిని కాల్చేయాలని ఆదేశాలొచ్చాయి. ఈ మేరకు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (IDF) దళాలకు 'షూట్ ఆన్ సైట్' ఆదేశాలిచ్చింది.