టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పై మంత్రి అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇదిలావుంటే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు ఈ రోజు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు విచారించారు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో నిన్న ఢిల్లీ నుంచి విజయవాడకు వచ్చిన లోకేశ్, ఈ రోజు విచారణకు హాజరయ్యారు. విచారణ అనంతరం అధికారుల ప్రశ్నలపై నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు టీడీపీ యువనేతపై సామాజిక అనుసంధాన ఎక్స్ వేదికగా చురకలు అంటించారు. తండ్రిని అరెస్ట్ చేస్తే భార్యాపిల్లలను వదిలి ఢిల్లీ పారిపోయిన బడుద్దాయి అంటూ ఘాటుగా విమర్శించారు.