నంద్యాల పట్టణంలోని గాంధీ నగర్ లో మంగళవారం దారుణం చోటుచేసుకుంది. మతిస్థిమితం లేని ఓ మహిళ తన 18 నెలల కుమారుడిని గొంతు కొరికి చంపేసింది. పసి బాలుడి కేకలు విన్న చుట్టుపక్కల వారు వైద్యం నిమిత్తం ఆసుపత్రికి తరలించేలోపే మార్గమధ్యలో బాబు మృతి చెందాడు. ఘటనపై నంద్యాల మూడవ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.