దసరా పండగ ప్రయాణాలకు 62 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు పల్నాడు జిల్లా ప్రజారవాణా అధికారి శ్రీనివాసరావు మంగళవారం తెలిపారు. ఈనెల18 నుంచి 23 వరకు హైదరాబాదులోని వివిధప్రాంతాల నుంచి జిల్లాలోని అన్నిప్రాంతాలకు బస్సులు వస్తాయన్నారు. సాధారణ సర్వీసులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆయన పేర్కొన్నారు. సాధారణ ఛార్జీలే అమలు చేస్తామన్నారు. డిమాండుకు తగ్గట్టు బస్సులు పెంచే ఆలోచన ఉందన్నారు.