గుంటూరు జిల్లా ఎన్. జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం అగ్రి బీఎస్సీ (హాన్స్), బి. టెక్ (ఫుడ్ టెక్నాలజీ) కోర్సుల్లో మిగిలిపోయిన సీట్లలో ప్రవేశాలకు దరఖాస్తులు ఈనెల 12, 13 తేదీల్లో అభ్యర్థులు ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని పరీక్షల నియంత్రణ అధికారి సుధాకర్ మంగళవారం తెలిపారు. మొదటి విడత కౌన్సెలింగ్లో సీట్లు పొంది కళాశాలల్లో చేరిన విద్యార్థులతో పాటు రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు అర్హులన్నారు.