రేపల్లె ఆర్డిఓ కార్యాలయంలో మంగళవారం వివిధ రాజకీయ పార్టీ నాయకులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆర్డీవో కార్యాలయ పరిపాలనాధికారి జాన్ పీటర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. 2024 జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకుల నుండి ఓటు హక్కు కొరకు దరఖాస్తులను స్వీకరిస్తున్నామని తెలిపారు. ఇంటింటి సర్వేలో వచ్చిన అభ్యంతరాలపై పూర్తిస్థాయిలో విచారణ జరుగుతుందన్నారు.