మండల కేంద్రంలోని వల్లూరు మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ విజయరామరాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి అధికారులు అర్జీలు స్వీకరించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గణేష్, ట్రైనీ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, ఆర్డీవో ధర్మచంద్ర రెడ్డి, జిల్లా స్థాయి అధికారులు, తదితరులు పాల్గొన్నారు.