జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని గంగాధరనెల్లూరు మండలం ఎంపీడీవో శ్రీదేవి పిలుపునిచ్చారు. బుధవారం మండల పరిధిలోని వెంకటాపురం పంచాయతీలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఈ కార్యక్రమము ముఖ్య ఉద్దేశంపై ప్రజలకు అవగాహన కల్పించి నిష్ణాతులైన వైద్యులచే మందులు మాత్రలను పంపిణీ చేశారు. వైసిపి నేత బాబు నాయుడు పాల్గొన్నారు.