కార్మికులు జీతాలు అడిగితే విధులనుండి తొలగిస్తామని సర్పంచ్ లు అధికారులు బెదిరిస్తున్నారని ఏపి పారీశుద్యకార్మికుల సంఘం జిల్లా కార్యదర్శి రమేష్ బుధవారం విమర్శించారు. చిలమత్తూరు మండల వ్యాప్తంగా ఉన్న స్వచ్ఛభారత్ కార్మికులకు 12 నెలలు జీతాలు చెల్లించకపోవడంతో కార్మికుల నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు. పంచాయతీ కార్యదర్శులు నిర్లక్ష్యంతోనే జీతాలు అందడం లేదని, జీతాలు చెల్లించాలని కార్మికులు వాపోయారన్నారు.