రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక వ్యవహారాల యువజన సర్వీసుల మరియు క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజా నగరి రూరల్ మండలం ఓజు కుప్పం పంచాయితీ నందు రూ. 21. 80 లక్షల అంచనా విలువ గల నూతనంగా నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని బుధవారం ప్రారంభించారు. ముందుగా మంత్రిని వైఎస్ఆర్సిపి నాయకులు గజమాలతో ఘన స్వాగతం పలికి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, అధికారులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.