కందుకూరు పట్టణంలో ఇటీవల రూ. 5 కోట్లతో జీర్ణోద్ధరణ జరిగిన అంకమ్మతల్లి ఆలయంలో 40 రోజుల పాటు ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. దీంతో డా. ఇక్బాల్ అహ్మద్ జన్మదినం సందర్భంగా దంపతులిద్దరు కలిసి ఆలయంలో అభిషేకం, పూజలు నిర్వహించారు. మనసుక, మతానికి సంబంధం లేదని వారు నిరూపించారు. అనంతరం ఆయన సతీమణి డాక్టర్ అదిలాబాను లలితా పారాయణం పుస్తకాలను భక్తులకు అందజేశారు.