గిద్దలూరు మండలం పొదలకుంటపల్లి గ్రామంలో బుధవారం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని గిద్దలూరు ఎంపీపీ కడప లక్ష్మీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇటీవల పొదలకుంట పల్లిలో ఇంటి వద్ద వైద్య పరీక్షలు చేసిన వారికి బుధవారం వైద్య పరీక్షలు చేసి అవసరమైన వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా అనారోగ్యంతో బాధపడే వారికి ఉచితంగా వైద్య సహాయం అందిస్తున్నామని ఎంపీపీ అన్నారు.