శరన్నవరాత్రుల ఉత్సవాలకు ప్రొటోకాల్ ఉన్న వ్యక్తులకు మినహా ఇతరులకు దుర్గ గుడిలో అంతరాలయం దర్శనాలు ఉండబోవని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్. డిల్లీరావు స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం ప్రకటన విడుదల చేశారు. సామాన్య భక్తులకు దర్శనం కలిగించేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన వివరించారు. లఘుదర్శనాల ద్వారా ఎక్కువ మందికి దర్శనభాగ్యానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.