మాజీ సీఎం చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో స్వల్ప ఊరట లభిచింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో అక్టోబర్ 16( సోమవారం) వరకు, అంగళ్లు కేసులో అక్టోబర్ 12( గురువారం) వరకు చంద్రబాబును అరెస్టు చేయవద్దని ఆదేశించింది. ఈ మేరకు రెండు కేసుల్లోనూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అటు ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో పీటీ వారెంట్, పోలీస్ కస్టడీపై ఎలాంటి ఆదేశాలు ఇవ్వొద్దని ఏసీబీ కోర్టుకు ఆదేశాలిచ్చింది.