డిఎన్‌ఏ మితిలైజేషన్ విధానాన్ని ఉపయోగించే ఓవప్రింట్ అనే పరీక్ష ద్వారా వివిధ రకాలైన ప్రారంభ దశ కాన్సర్ లను గుర్తించే పరీక్షలను పరిశోదకులు అభివృద్ది చేశారు. ఈ పరీక్ష ద్వారా ప్రారంభ దశ అండాశయ కాన్సర్ ను గుర్తించారు. 370 కంటే ఎక్కువ కణజాలం, రక్త నమూనాలను సేకరించి 91 శాతం ఖచ్చితత్వ రేటును సాధించారు. ఇది వైద్యులకు ఉత్తమ చికిత్స ఇవ్వడంలో సుఫలితాలనిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు.