టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పై వైసీపీ నేత సజ్జల రామకృష్ణుడు సంచలన ఆరోపణలు చేశారు. రూ.300 కోట్లు జేబులో వేసుకోవడానికే చంద్రబాబు స్కిల్ కుట్ర చేశారని అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 'ఊరు, పేరు లేని వారితో అగ్రిమెంట్ చేసుకున్నారు. అన్ని సాక్ష్యాధారాలతోనే సీఐడీ చంద్రబాబును అరెస్ట్ చేసింది. కోర్టు ఆ విషయాన్ని నమ్మింది కాబట్టే రిమాండ్ విధించింది" అని అన్నారు.