తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తంజావూరులోని వ్యవసాయ కళాశాల, పరిశోధనా సంస్థకు ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త, భారత హరితవిప్లవ పితామహుడు డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ పేరు పెట్టనుంది. ఈ మేరకు అసెంబ్లీలో సీఎం ఎంకే స్టాలిన్ ప్రకటించారు. అలాగే తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్లాంట్ ప్రోపగేషన్, జెనిటిక్స్ విభాగాల్లో టాపర్లుగా నిలిచిన వారికి స్వామినాథన్ పేరిట అవార్డును ఏర్పాటు చేస్తామని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa