అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో విద్యార్థుల మధ్య గ్యాంగ్ వార్ జరిగింది. పట్టణంలోని SKBR కాలేజీ లో డిగ్రీ విద్యార్థులు రోడ్డుపై రెండు గ్రూపులుగా విడిపోయి కొట్లాటకు దిగారు. ఈ నెల 5న జరిగిన ఫేర్వెల్ పార్టీలో బీఏ, బీకామ్ విద్యార్థుల మధ్య పాట విషయంలో వివాదం రేగింది. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం కొంతమంది మళ్లీ గొడవలకు దిగారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. రెండు గ్రూపుల విద్యార్థుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని అమలాపురం డీఎస్పీ అంబికా ప్రసాద్ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. విద్యార్థులు ఇలా రోడ్లపై కొట్లాడటంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. పోలీసుల ఎంట్రీతో ఈ గొడవ ఆగింది.. విద్యార్థులు ఘర్షణకు దిగిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ గొడవలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అటు కాలేజీ యాజమాన్యం కూడా ఈ ఘర్షణపై స్పందించాల్సి ఉంది.