స్కిల్ డెవల్‌పమెంట్ కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ టీడీపీ అధినేత చంద్రబాబు బుధవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఏసీబీ కోర్టు బెయిల్ నిరాకరించడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఈ విచారణ నేడు న్యాయమూర్తి జస్టిస్ సురేశ్‌రెడ్డి ఎదుట విచారణకు రానుంది. రాజకీయ కక్షతోనే కేసు నమోదు చేశారని చంద్రబాబు తన పిటిషన్లో పేర్కొన్నారు. చట్టాన్ని గౌరవించే వ్యక్తిని.. ప్రజాజీవితంలో ఉన్నాను. సీఐడీ దర్యాప్తునకు సహకరిస్తాను. కోర్టు విధించే షరతులకు కట్టుబడి ఉంటాను. బెయిల్ మంజూరు చేయండి’ అని అభ్యర్థించారు.