ఇండియాలోనే అతిపెద్ద ఐటీ సంస్థ ఐన TCS తమ ఉద్యోగులకు ఇకపై వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ విధానం లేదని, ఖచ్చితంగా ఆఫీస్ కి రావాల్సిన అవసరం ఉందని తెలిపింది. TCSలో 6,08,985 మంది పని చేస్తున్నారు. గత మూడు నెలల్లో 6 వేల మంది ఉద్యోగులు కంపెనీని విడిచిపెట్టారు. ఈ ఏడాది కొత్తగా 40 వేల మంది ఉద్యోగులను నియమించుకోవాలని టీసీఎస్ ఆలోచన చేస్తుంది.