ఇజ్రాయెల్, హమాస్ల మధ్య యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. ఈ క్రమంలో ఇరు దేశాలు ఒకరిపై ఒకరు బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఇజ్రాయెల్ నుంచి తమ పౌరులను వెనక్కి తీసుకురావడానికి భారత్ ‘ఆపరేషన్ అజయ్’ను ప్రారంభించింది. ఇందులో భాగంగా పౌరుల తక్షణ తరలింపు కోసం ప్రత్యేక చార్టర్ విమానాలను ఏర్పాటు చేయనున్నట్లు విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ తెలిపారు.