వ్యవసాయ అనుబంధ రంగాలతోపాటు పౌర సరఫరాల శాఖపై సీఎం జగన్ బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ..... ‘ఏటా రైతుల నుంచి తృణ ధాన్యాలను కొనుగోలు చేస్తున్నందున, ఫుడ్ ప్రొసెసింగ్ యూనిట్లను ఉపయోగించి, మిల్లెట్ల ప్రొసెసింగ్ చేయాలి. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా మిల్లెట్లను ప్రజలకు పంపిణీ చేయాలి. మిల్లెట్ల వినియోగంతో ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి. ఆర్బీకేల స్థాయిలో భూసార పరీక్షలు చేసేలా చర్యలు తీసుకోవాలి. దీనికి తగిన ప్రణాళిక సిద్ధం చేయాలి. అమూల్‌ను మరింత ముందుకు తీసుకెళ్లాలి. పశుగ్రామం, దాణా కొరత లేకుండా చూడాలి. ప్రతి ఆర్బీకే యూనిట్‌గా పశువులకు టీఎంఆర్ ఇచ్చేలా చూడాలి’ అని అధికారులను ఆదేశించారు.