ఛత్తీస్‌గఢ్ రాయ్‌పూర్‌లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరిగింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను నిర్ణయించడమే లక్ష్యంగా ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న సీఎం భూపేశ్ బఘేల్ తన ఫోన్లో ‘క్యాండీక్రష్’ గేమ్ ఆడుతూ కనిపించారు. పార్టీ కీలక భేటీపై ఆయన పెద్దగా ఆసక్తి కనబర్చలేదు. దాంతో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. విపక్షాలు సీఎంపై వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు.