సీఎం జగన్ మోహన్ రెడ్డి విశాఖకు మకాం మార్చడం మరోసారి వాయిదా పడింది. ఆయన డిసెంబరులో మారబోతున్నారంటూ మరో అనధికారిక వార్త వైరల్ అవుతోంది. గత నెలాఖరులో జరిగిన మంత్రి మండలి సమావేశంలో దసరాకు సీఎం విశాఖకు మారేందుకు నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రభుత్వ ప్రతినిధులు చెప్పారు. కానీ ఇప్పుడు దసరాకు కాదు డిసెంబరులో వెళతారని అంటున్నారు. డిసెంబర్ 21న జగన్ పుట్టిన రోజు నేపథ్యంలో ఆ రోజున వెళ్తారని సమాచారం.