వ్యవసాయం, పౌర సరఫరాల శాఖపై సీఎం జగన్ బుధవారం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో పంటల సాగును అధికారులు సీఎంకు వివరించారు. జూన్, ఆగస్టు నెలల్లో వర్షాలు లేక సాగుపై ప్రభావం పడిందని తెలిపారు. ధాన్యం కొనుగోలులో రైతులకు మేలు జరిగేలా చూడాలని సీఎం పేర్కొన్నారు. మిల్లర్లను ఆశ్రయించాల్సిన అవసరం రైతులకు రాకూడదన్నారు.