ఇళ్ల పట్టాల పేరుతో పేదవాళ్ల పేరు చెప్పి భూములు దోచుకుంటున్నారని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు గురువారం అన్నారు. 'మేం టిడ్కో ఇళ్లు పూర్తి చేస్తే వాటికి వైసీపీ రంగులు వేసుకుంది. జగన్ ప్రభుత్వం ఎన్ని ఇళ్లు కట్టించిందో శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. ఒకవైపు ఎస్సీ, బీసీలకు పథకాలు రద్దుచేసి.. మరోవైపు ఖజానా ఖాళీ చేశారు. ఈ నిధులన్నీ ఎవరి జేబుల్లోకి వెళ్లాయో లెక్కలు చెప్పాలి' అని ఆయన డిమాండ్ చేశారు.