నవరత్నాల పథకంలో భాగంగా రాష్ట్ర ప్రజలందరికీ ఇల్లు పంపిణీ చేయాలనే ఉద్దేశంతో కాకినాడ జిల్లా సామర్లకోటలో తలపెట్టిన కార్యక్రమానికి సీఎం జగన్ మోహన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన వైయస్సార్ జగన్ అన్న కాలనీలో దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని రిమోట్ బటన్ ద్వారా నొక్కి ప్రారంభించారు. అనంతరం ఆయన జగనన్న కాలనీలో నిర్మించినటువంటి నూతన గృహాలను ప్రారంభించేందుకు బయలుదేరారు.