కళ్యాణదుర్గం పరిధిలోని కూడేరు మండలం పి నాగిరెడ్డిపల్లికి చెందిన మారుతమ్మ బ్రహ్మసముద్రం మండలం కోనాపురం గ్రామానికి చెందిన మేడ రాధాకృష్ణను ఆరేళ్ల కిందట కులాంతర వివాహం చేసుకుంది. మేడా రాధాకృష్ణ నాలుగేళ్ల కిందట మరణించాడు. ఆమె హైకోర్టును ఆశ్రయించడంతో భర్త పేరు మీద ఉన్న ఆస్తి 6.24 ఎకరాలు మారుతమ్మకు దక్కింది. ఇది సహించలేని బావ మేడ వెంకటేశులు బుధవారం కంబదూరు పట్టణంలోని శంకరప్ప కాలనీలో ఉంటున్న మారుతమ్మ నివాసానికి కొడవలితో వెళ్లి ఆమె మెడ భాగంపై నరికాడు. దీంతో ఆమె కుప్పకూలిపోయింది. వెంటనే బాధితురాలి తండ్రి నారాయణప్ప కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రికి ఆమెను తరలించారు. కేసు నమోదు చేసుకున్న పట్టణ పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.