ఎన్నికల కౌంటింగ్ తేదీని మార్చాలంటూ మిజోరాంలోని పలు రాజకీయ పార్టీలు ఎలక్షన్ కమిషన్ (ఈసీ)ని కోరారు. షెడ్యూల్ ప్రకారం మిజోరాంలో డిసెంబర్ 3న (ఆదివారం) కౌటింగ్ జరగనుంది. అయితే క్రైస్తవులు అధికంగా ఉన్న తమ రాష్ట్రంలో ఆదివారం ప్రత్యేక ప్రార్థనలు జరుగుతాయని, దీన్ని దృష్టిలో పెట్టుకుని కౌంటింగ్ తేదీని మార్చాలని ఆయా రాజకీయ పార్టీలు కోరాయి.