మాజీ సీఎం చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో ఉపశమనం లభిచింది. అంగళ్లు కేసులో ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. అంగళ్లు ఘటనకు సంబంధించి అన్నమయ్య జిల్లా ముదివేడు పోలీసులు తనపై నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.