‘‘డీఎస్సీపై కొద్ది రోజుల్లోనే స్పష్టత వస్తుందని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. డీఎస్సీపై ముఖ్యమంత్రి వద్ద చర్చ జరుగుతోంది. ముందు టెట్.. ఆ తర్వాత డీఎస్సీ నిర్వహిస్తాం. యూనివర్సిటీలు, ట్రిపుల్ ఐటీల్లో 3,200కి పైగా పోస్టులు భర్తీ చేస్తాం. నాలుగైదు రోజుల్లో నోటిఫికేషన్ వస్తుంది. 18 ఏళ్ల నుంచి యూనివర్సిటీల్లో పోస్టుల భర్తీ జరగలేదు. పాఠశాలల్లో ఖాళీలన్నింటినీ గుర్తించాం’’ అని చెప్పారు.