కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన హరిజన మారుతమ్మ ఆర్డీటీ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది. మేడా రాధాకృష్ణతో ప్రేమ వివాహమైంది. అనారోగ్యంతో రాధాకృష్ణ మృతి చెందడంతో ఆస్తి ఆమెకు దక్కింది. ఆస్తికోసం కక్ష పెంచుకున్న బావ మేడా వెంకటేశులు గురువారం ఇంటిలో అన్నం తింటున్న ఆమెపై కత్తితో దాడి చేసి గాయపరిచాడు. ఆమెను చికిత్స నిమిత్తం అనంతపురం తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.