రైల్వే ప్రయాణికుల భద్రత, రైల్వే ఆస్తుల పరిరక్షణకై ఆర్పిఎఫ్, ఆర్పీఎఫ్ పోలీసులు సమన్వయం తో విధులను నిర్వహించాలని రైల్వే ఐజి అరోమా సింగ్ ఠాగూర్ అన్నారు. గురువారం ఆమె గుంతకల్లు రైల్వే ఎస్పీ కార్యాయాన్ని సందర్శించి ఎస్పీ చౌడేశ్వరితో రైల్వే ఆస్తుల పరిరక్షణ, ప్రయాణికుల భద్రతపై చర్చలు జరిపారు. రైల్వే పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్తుల వివరాలు సేకరించడం వంటి వాటిని ఎస్పీ ఆమెకు వివరించారు.