చంద్రబాబుకు ఏదైనా జరిగితే కర్త, ఖర్మ, క్రియ అంతా రాష్ట్ర ప్రభుత్వానిదే అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచెంనాయుడు అన్నారు. చంద్రబాబును అక్రమంగా జైలుకు పంపారని, 34 రోజులుగా జైల్లో చంద్రబాబు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. చంద్రబాబు ఆరోగ్యం.. భద్రత విషయంలో ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తాము చెబుతూనే ఉన్నామన్నారు. ఇప్పుడు చంద్రబాబు అనారోగ్యం బారిన పడ్డారన్నారు. చంద్రబాబుకున్న స్కిన్ ప్రాబ్లం వల్ల ఏసీ తప్పనిసరి అని అన్నారు. కనీసం వేన్నీళ్లు కూడా ఇవ్వడం లేదన్నారు. డీహైడ్రేషన్, స్కిన్ ప్రాబ్లం వల్ల చంద్రబాబు ఆరోగ్యం ప్రమాదంలో పడిందని చెప్పారు.