గుంటూరు తూర్పు నియోజకవర్గంలో గురువారం జరిగిన జగనన్న సురక్ష కార్యక్రమాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజిని పరిశీలించారు. జగనన్న సురక్ష కార్యక్రమంలో ప్రజలకు అందిస్తున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. వైద్య సేవలు పూర్తిస్థాయిలో అందించాలని సూచించారు. ఆమె వెంట ఎమ్మెల్యే ముస్తఫా, జాయింట్ కలెక్టర్ రాజకుమారి, గుంటూరు కమిషనర్ చేకూరి కీర్తి, పలువురు వైసిపి నేతలు పాల్గొన్నారు.