టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి నేడు జైలులో చంద్రబాబుని కలిశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... . తన భర్త క్షేమం గురించి చాలా ఆందోళన చెందుతున్నానన్నారు. ఆయన ఇప్పటికే 5 కిలోల బరువు తగ్గారని పేర్కొన్నారు. ఇంకా బరువు తగ్గితే కిడ్నీలపై తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్యులు చెబుతున్నారని భువనేశ్వరి తెలిపారు. జైల్లో ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకులు అపరిశుభ్రంగా ఉండడంతో చంద్రబాబు ఆరోగ్యానికి తీవ్ర ముప్పు వాటిల్లుతోందన్నారు. ఈ భయంకరమైన పరిస్థితులు తన భర్తకు తీవ్ర ముప్పు తలపెట్టేలా ఉన్నాయని నారా భువనేశ్వరి అన్నారు.