టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు అయన మీడియాతో మాట్లాడుతూ.. సస్యశ్యామలంగా ఉండే కృష్ణా డెల్టా ప్రాంతం వైసీపీ పాలనలో ఎడారైందన్నారు. కృష్ణా నదీ జలాల నిర్వహణలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. కళ్ల ముందే పంట ఎండిపోవటంతో రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారని తెలిపారు. నీరు అందక రేపల్లె నియోజకవర్గంలోని రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కృష్టా జలాలు విడుదల చేసి డెల్టా ప్రాంత రైతుల్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పండించిన పంటలకు సరైన గిట్టుబాటు ధర కల్పించాలని.. లేకుంటే నాగలిని శిలువగా మోస్తూ రైతుల పక్షాన పోరాటానికి శ్రీకారం చుట్టి తక్షణమే పదవికి రాజీనామా చేస్తానని అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు.