రాజమహేంద్రవరం లోకేశ్ శిబిరంలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కలిశారు. ఈ సందర్భంగా అయన మీడియాతో మాట్లాడుతూ....రాష్ట్ర ఖజానాను జగన్ జేబు సంస్థలకు కట్టబెట్టడంతో రూ.2 లక్షల 57వేల కోట్లు దోచేశారు. రాష్ట్రంలో ఇప్పటికి రూ.11 లక్షల కోట్లుపైబడి అప్పులు చేశారు. రుషికొండలో రూ.270 కోట్లు ఖర్చు చేసి విలాసవంతమైన క్యాంప్ ఆఫీసు నిర్మించారు. తాను తప్పు చేయలేదని జగన్ ఏనాడూ అనలేదని అంటే... తాను చేసిన దోపిడీని అంగీకరించినట్లే. టీడీపీ అధికారంలోకి వచ్చాక కక్కించి రాష్ట్ర అభివృద్ధికి వినియోగిస్తాం’’ అని యనమల చెప్పారు.