ఫైబర్‌నెట్ కేసులో బెయిల్ కోరుతూ చంద్రబాబు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ముందస్తు బెయిల్‌ను హైకోర్టు తిరస్కరించడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. చంద్రబాబు తరఫున ప్రముఖ న్యాయవాదులు హరీశ్ సాల్వే, సిద్ధార్థ్ లూథ్రూ, అభిషేక్ మను సింఘ్వి వాదిస్తున్నారు. ఇక సీఐడీ (ఏపీ ప్రభుత్వం) తరఫున ముకుల్ రోహత్గి, రంజిత్ కుమార్, నిరంజన్ రెడ్డి, తదితరులు వాదనలు వినిపిస్తున్నారు. ఐతే సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది. స్కిల్ కేసులో చంద్రబాబు పిటిషన్ విచారణ సందర్బంగా ఫైబర్ నెట్ కేసునూ విచారిస్తామని ధర్మాసనం తెలిపింది. జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం. త్రివేది ధర్మాసనం విచారణ జరపనుంది.