ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పవన్ గురించి మాట్లాడే అర్హత జగన్ కి లేదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 13, 2023, 01:53 PM

తల్లిని, తోబుట్టువులను మోసం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని, తన ఎదుగుదల కోసం వినియోగించుకుని ముగ్గురు మహిళల్ని వదిలేశారని జనసేన నేత పోతిన వెంకట మహేష్అన్నారు. కన్న తల్లిని, తోడబుట్టిన చెల్లిని ఇంటిలో నుంచి గెంటేశారన్నారు. మరొక సోదరి సునీతను కూడా ఈరోజుకు కూడా కోర్టులు చుట్టూ తిప్పి ఏడిపిస్తున్నారని మండిపడ్డారు. కుటుంబంలోని మహిళలను మోసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి నేడు నీతులు ‌చెబుతున్నారని విమర్శించారు. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డికి లేదన్నారు. విజయమ్మ తన రాజకీయ భవిష్యత్తుకు అడ్డువస్తుందనే ఆమెను విశాఖలో 2014 ఎన్నికల్లో పోటీ చేయించి దగ్గర ఉండి ఓడించారని ఆరోపించారు. జగన్ అని తన రాజకీయ భవిష్యత్తుకు అడ్డు వస్తుందనే కదా సొంత తల్లినీ కూడా తడి గుడ్డతో గొంతు కోశారని పోతిన వెంకట వ్యాఖ్యలు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com