స్కిల్‌డెవలప్‌మెంట్ కేసును సీబీఐకి అప్పగించాలంటూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వేసిన పిటిషన్‌పై పిటిషన్‌పై హైకోర్టులో ఈరోజుకు వాదనలు ముగిశాయి. కేసు విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసిన కోర్టు.. ప్రతివాదులకు నోటిసులు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో వాస్తవాలను దర్యాప్తు చేయాలని పిటిషన్ తరుపు న్యాయవాది వాదించారు. ఈడీ, ఐటీ, సీఐడీ కూడా ఈ కేసు విచారణ చేస్తుంది కాబట్టి వాస్తవాలు సీబీఐకి ఇస్తే బయటకు వస్తాయని వాదనలు వినిపించారు. హై ప్రొఫైల్ కేసు కాబట్టీ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టును కోరారు. కేసును సీబీఐకు ఇవ్వటంపై తమకేమీ అభ్యతరం లేదని స్కిల్ కేసు, ఫైబర్ నెట్, ఇన్నర్ రింగ్ రోడ్ కేసులను సీబీఐ విచారణకు ఇవ్వాలని తాము ఎప్పటినుంచో కోరుతున్నామని ఏజీ శ్రీరామ్ చెప్పారు.