టీడీపీ అధినేత చంద్రబాబును అక్రమ కేసులో జైలుకు పంపారని మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు. గురువారం కల్లూరు, ఓబయ్య నగర్లో నేను సైతం.. బాబు కోసం కార్యక్రమంలో ఆమె పాల్గొని, ఇంటింటికీ తిరిగి కరపత్రాలను పంపిణీ చేసారు. ఈసందర్బంగా గౌరు చరిత మాట్లాడుతూ..... జగన్ 16 నెల లు జైల్లో ఉన్నాడని, ఒక్కరోజైనా చంద్ర బాబును జైల్లోపెట్లానే లక్ష్యంతోనే అక్రమ కేసులో ఇరికించారని ఆరోపించారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని 2024 ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి గుణపాఠం తప్పదని హెచ్చరించారు.