నిన్న కాకినాడజిల్లా సామర్లకోటలో గృహోత్సవం కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాల్గొనగా, మచిలీపట్నంలో కలెక్టర్, ఇతర అధికారులు వీక్షించారు. నిర్మాణాలు పూర్తిచేసిన గృహాలను కలెక్టర్ అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ, గృహనిర్మాణాల్లో కృష్ణాజిల్లా రాష్ట్రంలో 9వ స్థానంలో ఉందన్నారు. అన్ని నియోజకవర్గాల్లోని జగనన్న కాలనీల్లో కనీస మౌలికవసతులు కల్పిస్తామని తెలిపారు. సమావేశంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ బూరగడ్డ రమే్షనాయుడు, మేయర్ చిటికెన వెంకటేశ్వరమ్మ, గృహనిర్మాణసంస్థ పీడీ జీవీ సూర్యనారాయణ, కార్పొరేటర్లు, సర్పంచ్లు పాల్గొన్నారు.