బీజేపీ సీనియర్ నేత సత్యకుమార్ , వైసీపీ ప్రభుత్వంపై ట్విట్టర్ వేదికగా ఘాటైన విమర్శలు గుప్పించారు. దివంగత వైఎస్సార్ అన్నట్టు... ‘‘తల్లికి తిండి పెట్టలేనోడు, పినతల్లికి బంగారు గాజులు చేయిస్తానన్నాడట’' అలా ఉంది ఏపీ సీఎం వ్యవహారం. సొంత జిల్లాలో, సొంత నియోజకవర్గంలో 10శాతం ఇళ్లు కూడా కట్టలేని కోతల సీఎం రాష్ట్రమంతా ఇళ్లు కడతాడట. పేదల కోసం ప్రధానమంత్రి నరేంద్రమోదీ లక్షల ఇళ్లు మంజూరు చేసి, వేల కోట్ల నిధులు విడుదల చేస్తే.. ఏపీ సీఎం రాష్ట్రం వాటాలో డబుల్ ఇళ్లకు పైసా ఇవ్వకుండా, ఇళ్లు కట్టకుండా, కేవలం సొంత పేర్లు పెట్టుకుని, రంగులేనుకుని బడాయిలు మాత్రం పోతున్నారని సత్యకుమార్ ట్విట్లో ఆగ్రహం వ్యక్తం చేశారు.