విజయనగరం జిల్లాలో అండర్-19 మహిళా క్రికెట్ పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. క్రీడాకారులు అబ్బురపరిచే బ్యాటింగ్, బౌలింగ్‌తో అదరగొడుతు న్నారు. బరోడా టీం గురువారం ప్రదర్శించిన ఆటతీరు అందరినీ ఆశ్చర్యప రిచింది. అత్యధిక స్కోరు చేశారు. డాక్టర్ పీవీజీ రాజు ఏసీఏ స్పోర్ట్స్ కాంప్లెక్‌ల్లో బీహార్- మిజోరాం జట్ల మధ్య గురువారం పోటీ జరిగింది. టాస్‌గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బీహార్ టీం నిర్ణీత 50 ఓవర్లలో 10 వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన మిజోరాం జట్టు 23 ఓవర్లలో 53 రన్స్‌కే కుప్పకూలింది. విజ్జీ మైదానంలో అ స్సాం-బరోడా జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన బరోడా టీం అస్సాం టీంకు చుక్కలు చూపించారు. నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 420 పరుగులు సాధించారు. ధరతి 154 రన్స్, అథోశి బెనర్జీ 128 రన్స్ చేసి ప్రత్యర్థులకు చెమటలు కక్కించారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆస్సాం టీం 38.2 ఓవర్లలో 98కి ఆలౌటయ్యారు. దీంతో బడోరా టీం అత్యధిక స్కోరుతో విజయకేతనం ఎగురవే సింది. ఇక కందుకూరి క్రికెట్ అకాడమీ మైదానంలో కేరళ- మధ్యప్రదేశ్ జట్ల మధ్య పోటీ జరిగింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన కేరళ టీం నిర్ణీత 50 ఓవర్లలో 10 వికెట్ల నష్టానికి 136 రన్స్ చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన మధ్యప్రదేశ్ టీం 30.3 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 139 పరుగులు సాధించి విజేతగా నిలిచింది. టోర్నీలో బ్యాటింగ్, బౌలింగ్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన బరోడా క్రీడాకారిణులైన సెంచ రీలు చేసిన ధరతి, అథోశి బెనర్జీని అందరూ అభినందించారు.