ఇజ్రాయెల్-హమాస్ ల మధ్య యుద్ధ పరిస్థితులు మరింత తీవ్రం అవుతుండటంతో శుక్రవారం ఢిల్లీలో పోలీసులు బందోబస్తు పెంచారు. ప్రార్థనాలయాల ముందు ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సంఘ విద్రోహ శక్తులు అల్లర్లు సృష్టించే అవకాశం ఉందని భద్రతా సంస్థలు హెచ్చరించిన నేపథ్యంలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం, సున్నిత ప్రాంతాలలో కూడా వారు గస్తీ కాస్తున్నారు.