టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్యంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. చంద్రబాబు సొంత డాక్టర్లను ప్రభుత్వం ఎందుకు సంప్రదించలేదు? అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రభుత్వ వైద్యులపై పోలీసులు ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై వాస్తవాలను వైద్యులను చెప్పనివ్వడంలేదంటూ మండిపడ్డారు.